సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్
Breaking News
అమ్మ నుంచి ఫోన్ కాల్..! లైవ్ ప్రెస్ మీట్‌లో నితీష్ ఏం చేశాడంటే?
Published on Sun, 06/14/2026 - 11:37
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా తరపున యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఏమి జరిగిందంటే?
నితీష్ మీడియాతో మాట్లాడుతుండగా.. మైక్‌ల ముందున్న అతడి మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. నితీశ్ ఒక్క నిమిషం ఆగి, ఫోన్ స్క్రీన్ వైపు చూసి చిరు నవ్వు చిందించాడు. ఫోన్ చేస్తోంది తన అమ్మ అని తెలియడంతో ఏమాత్రం సంకోచించకుండా.. “సారీ, నేను ఈ కాల్ మాట్లాడాలి” అని అక్కడున్న జర్నలిస్టులకు చెప్పి ఫోన్ ఎత్తాడు.
అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా’’ అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ ప్రెస్‌మీట్‌ను కొనసాగించిన నితీశ్ మరోసారి విలేకర్లకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ కాసేపు ఆగవచ్చు ఏమో కానీ అమ్మ నుంచి వచ్చే ఫోన్ కాల్ మాత్రం అస్సలు ఆగదు అంటూ ఆ వీడియో క్యాప్షన్‌గా బీసీసీఐ రాసుకొచ్చింది.
అదరగొట్టిన కుర్రాళ్లు
కాగా వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(102) కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో సత్తాచాటారు. వీరితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ కూడా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
Tags : 1