Breaking News

Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు!

Published on Sat, 12/28/2024 - 12:52

కఠిన శ్రమకు ఫలితం దక్కితే.. అంకితభావానికి ప్రతిగా అందమైన, అరుదైన బహుమతి లభిస్తే.. ఆటే ఆరోప్రాణంగా భావించే వారి త్యాగానికి సరైన గుర్తింపు దక్కితే ఎట్టా ఉంటది?!... టీమిండియా యువ క్రికెటర్‌ నితీశ్‌ రెడ్డి, అతడి తండ్రి ముత్యాలరెడ్డి భావోద్వేగాలను గమనిస్తే ఆ విషయం కళ్లకు కట్టినట్లు తెలుస్తది!!

తన కెరీర్‌ను త్యాగం చేసి
ఐదేళ్ల ప్రాయంలోనే క్రికెట్‌ పట్ల మక్కువ కనబరిచిన కుమారుడి కోసం ఆ తండ్రి ఉద్యోగం సైతం విడిచిపెట్టి.. కత్తిమీద సాము చేశాడు. కొడుకులోని ప్రతిభను గుర్తించి.. అతడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఎన్నో కష్టనష్టాలకోర్చాడు. అందుకు ప్రతిగా ఆ కుమారుడు ఆస్ట్రేలియా గడ్డపై అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు సాధించి.. రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేశాడు.

పుత్రోత్సాహం
తండ్రి కళ్లముందే ఆసీస్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ అంతర్జాతీయ కెరీర్‌లో.. అదీ చిన్న వయసులోనే శతకం బాదేశాడు. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీమిండియా అభిమానులకు వినోదం పంచడంతో పాటు.. పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా చేశాడు.

పట్టరాని సంతోషంతో కన్నీటి పర్యంతం
అవును.. ఆ తండ్రి ముత్యాలరెడ్డి, కొడుకు నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy). 21 ఏళ్ల 216 రోజుల వయసులో ఈ విశాఖపట్నం కుర్రాడు ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై.. టీమిండియా కష్టాల్లో ఉన్న విలువైన సెంచరీ చేశాడు. దీంతో తండ్రి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కంటతడి పెడుతూ.. తన ప్రార్థనలు ఫలించాయి అన్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ ముత్యాలరెడ్డి భావోద్వేగాని(Nitish Kumar Reddy Father Gets Emotional)కి గురైన తీరు అందరి మనసులను కదిలించింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘‘తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది. కొడుకంటే ఇలా ఉండాలి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ను తన సెంచరీతో గట్టెక్కించిన నితీశ్‌ రెడ్డిపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఐసీసీ, బీసీసీఐ కూడా నితీశ్‌ రెడ్డి సరైన సమయంలో.. సరైన చోట శతకం బాదాడంటూ కొనియాడాయి.

టీ20లతో టీమిండియా అరంగేట్రం
కాగా నితీశ్‌ రెడ్డి ఐపీఎల్‌-2024(IPL 2024)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడి.. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో చోటు సంపాదించిన ఈ యువ కెరటం.. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాల వల్ల టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఆటతోనే తిప్పి కొట్టాడు
అయితే, నితీశ్‌కు అనతికాలంలోనే పిలుపునిచ్చి సెలక్టర్లు తప్పుచేశారని.. కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. అతడికి బదులు.. ఆసీస్‌లో ఆడిన అనుభవం ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌ను బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

అయితే, ఆ విమర్శలన్నింటికీ నితీశ్‌ రెడ్డి తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌((41, 38 నాటౌట్‌, ఒక వికెట్‌))లో టీమిండియాను ఆదుకుని విజయంలో తన వంతు పాత్ర పోషించిన నితీశ్‌ రెడ్డి.. అడిలైడ్‌లోనూ 42, 42 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్‌ తీశాడు. మూడో టెస్టులోనూ తన వంతు సహకారం అందించాడు.

ఎంసీజీలో విశ్వరూపం
ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం నితీశ్‌ రెడ్డి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆసీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చక్కటి షాట్లతో అలరిస్తూ 171 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని.. టీమిండియాను మ్యాచ్‌లో నిలిపాడు. 

ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాగా నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్‌(474) కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది.  

చదవండి: ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)