Breaking News

జింక్‌ మైదానం నుంచి ఎంసీజీ సెంచరీ వరకు...

Published on Sun, 12/29/2024 - 04:03

సాక్షి, క్రీడావిభాగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం...మరో 25 ఏళ్ల సర్వీస్‌ మిగిలి ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం దానిని వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. దానికి ఎంత ధైర్యం కావాలి? తన అబ్బాయి ఆటపై ఎంత నమ్మకం ఉండాలి. విశాఖపట్నానికి చెందిన ముత్యాల రెడ్డి కి ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడు.

మున్ముందు ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిసినా అన్నింటినీ తట్టుకునేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు టెస్టు క్రికెటర్‌గా మారి ఎందరో కలలు గనే మెల్‌బోర్న్‌ మైదానంలో సెంచరీ సాధించిన క్షణం ఆయన ఆనందం కన్నీళ్లుగా మారి కనిపించింది! తన కష్టం ఫలించిన రోజు ఆ పుత్రోత్సాహం గురించి చెప్పేందుకు ఎన్ని విశేషణాలు కూడా సరిపోవేమో.  

ఆరేళ్ల వయసులో మొదలైన నితీశ్‌ రెడ్డి క్రికెట్‌ ఆట 12 ఏళ్లు వచ్చే సరికి పూర్తి స్థాయి క్రికెటర్‌గా మారాలనే కల వైపు అడుగులు వేసింది. ఏసీఏకు చెందిన కడప అకాడమీలో అండర్‌–14 విభాగంలో శిక్షణకు ఎంపికైన తర్వాత గమ్యంపై మరింత స్పష్టత వచ్చేసింది. ఇదే సమయంలో ముత్యాల రెడ్డి అనూహ్యం నిర్ణయం తీసుకున్నాడు.

ఉద్యోగరీత్యా రాజస్తాన్‌కు బదిలీ కాగా...అలా వెళితే తన కొడుకును తీర్చిదిద్దడం కష్టమవుతుందని ఆయన భావించాడు. అందుకే హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంలో కొడుకు కోసం కేటాయించేశాడు. బీసీసీఐ అండర్‌–16 టోర్నీ విజయ్‌మర్చంట్‌ ట్రోఫీలో ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 1237 పరుగులు చేయడటంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 

176.71 సగటుతో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చేసిన ఆ పరుగులు బీసీసీఐ ఉత్తమ ఆటగాడి అవార్డును అందించాయి. నాగాలాండ్‌తో జరిగిన పోరులో 366 బంతుల్లో 60 ఫోర్లు, 7 సిక్స్‌లతో చేసిన 441 పరుగులు నితీశ్‌ ధాటిని చూపించాయి. అలా మొదలైన ప్రస్థానం అండర్‌–19 జట్టుతో పాటు ఆ తర్వాత ఆంధ్ర సీనియర్‌ టీమ్‌లో కూడా అవకాశం కల్పించాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున నితీశ్‌ దూకుడును అభిమానులంతా చూశారు. 

గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర తరఫున 25 వికెట్లు తీయడంతో అతని బౌలింగ్‌ పదును కూడా సెలక్టర్లకు అర్థమైంది. అందుకే జాతీయ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నితీశ్‌ తాజా ప్రదర్శన టెస్టు జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేయడం ఖాయం. ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్‌లలో కూడా ఈ అబ్బాయి అద్భుతాలు చేయడం ఖాయం.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు