Breaking News

సెమీఫైనల్లో నిఖత్‌ జరీన్‌

Published on Mon, 06/30/2025 - 02:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తేజం, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన నిఖత్‌ జరీన్‌ సొంతగడ్డపై జరుగుతున్న ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన 51 కేజీల కేటగిరీ క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ 5–0తో కల్పన (సాయ్‌)పై ఏకపక్ష విజయం సాధించింది. మాజీ యూత్‌ ప్రపంచ చాంపియన్‌ అంకుషిత బొరో (టాప్స్‌) కూడా సెమీఫైనల్‌కు చేరింది. 

65 కేజీ కేటగిరీలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆమె 5–0తో రాజస్తాన్‌ బాక్సర్‌ పార్థవిపై గెలిచింది. తెలంగాణ బాక్సర్లలో 65 కేజీల విభాగంలో యశి శర్మ  3–2తో సరిత రాయ్‌ (ఉత్తరప్రదేశ్‌)పై గెలుపొందగా, 60 కేజీల విభాగంలో గోనెళ్ల నిహారిక 5–0తో ప్రియాంక (చత్తీస్‌గఢ్‌)పై విజయం సాధించింది. 

అయితే నిరూపమ, చిలువేరు అపర్ణలకు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. 57 కేజీ కేటగిరీలో అపర్ణ 0–5తో కమల్జీత్‌ కౌర్‌ (ఏఐపీ) చేతిలో, 54 కేజీ కేటగిరీలో నిరూపమ 0–5తో తను (ఎస్‌ఎస్‌సీబీ) చేతిలో పరాజయం చవిచూశారు. 48 కేజీల్లో వహి వజీర్‌ 0–5తో మంజురాణి చేతిలో ఓడింది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)