Breaking News

పతకానికి విజయం దూరంలో నిఖత్‌ జరీన్‌

Published on Wed, 09/10/2025 - 04:11

లివర్‌పూల్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్‌ జరీన్‌ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ 51 కేజీల విభాగంలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ 5:0తో జపాన్‌కు చెందిన యునా నిషినాకాపై విజయం సాధించింది. 

29 ఏళ్ల నిఖత్‌ 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించి పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మీనాక్షి 5:0తో వాంగ్‌ కియుపింగ్‌ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సుమిత్‌ కుందు (75 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు), నరేందర్‌ (ప్లస్‌ 90 కేజీలు), లక్ష్య చహర్‌ (80 కేజీలు)  ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు. 

సుమిత్‌ 0:5తో రామి కివాన్‌ (బల్గేరియా) చేతిలో, సచిన్‌ 1:4తో బిబార్స్‌ జెక్సన్‌ (కజకిస్తాన్‌) చేతిలో, నరేందర్‌ 1:4తో డీగో లెంజీ (ఇటలీ) చేతిలో, లక్ష్య చహర్‌ 0:3తో సీజర్‌ యోజెర్లిన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో భారత్‌ నుంచి ప్రస్తుతం ఇద్దరు బాక్సర్లు మాత్రమే బరిలో మిగిలారు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)