Breaking News

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ శుభారంభం

Published on Sun, 09/07/2025 - 02:27

లివర్‌పూల్‌: తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతూ శుభారంభం చేసింది. మరో వైపు టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌కు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో గాయంతో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన నిఖత్‌ ఈ టోర్నీకి దీటుగా సిద్ధమైంది. శనివారం మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె అద్భుతమైన పంచ్‌ పవర్‌తో అమెరికా ప్రత్యర్థి జెన్నిఫర్‌ లొజానోను కంగుతినిపించింది. 

ఈ తెలంగాణ స్టార్‌ 5–0తో జెన్నిఫర్‌పై తిరుగులేని విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. అయితే మహిళల 75 కేజీల కేటగిరీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన లవ్లీనా తొలి రౌండ్లోనే 0–5తో టర్కీకి చెందిన బుస్రా ఇసిల్దార్‌ చేతిలో కంగుతింది. పురుషుల ఈవెంట్‌లోనూ భారత్‌కు శనివారం కలిసిరాలేదు. రెండు సార్లు ప్రపంచకప్‌ పతకాలు సాధించిన హితేశ్‌ గులియా 70 కేజీల కేటగిరీలో రెండో రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు. 

మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత బాక్సర్‌ 1–4తో బాస్‌ ఫిన్‌ రాబర్ట్‌ చేతిలో ఓడాడు. హితేశ్‌కు తొలిరౌండ్లో బై లభించగా.. రెండో రౌండ్లో తలపడిన భారత ఆటగాడికి డచ్‌ బాక్సర్‌ చేతిలో చుక్కెదురైంది. పురుషుల 90 ప్లస్‌ కేజీల తొలిరౌండ్లో నరేందర్‌ బెర్వాల్‌ 4–1తో ఐర్లాండ్‌ బాక్సర్‌ మారి్టన్‌ క్రిస్టోఫర్‌పై విజయం సాధించాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)