Breaking News

ఫైనల్లో నిఖత్‌ జరీన్‌  

Published on Sun, 02/11/2024 - 03:41

సోఫియా: భారత టాప్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన నిఖత్‌ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్‌లో నిఖత్‌ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్‌ జ్లాటిస్లోవ్‌ చుకనోవాపై విజయం సాధించింది.

తొలి రౌండ్‌లో నిఖత్‌ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్‌ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్‌ స్కోరింగ్‌తో చివరకు 5–0తో నిఖత్‌దే పైచేయి అయింది.

నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్‌ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్‌ అరుంధరి చౌదరి కూడా ఫైనల్‌కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)