Breaking News

ఒలింపిక్స్‌: నిఖత్‌ ‘పంచ్‌’ సూపర్‌...

Published on Mon, 07/29/2024 - 04:15

పారిస్‌: తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత స్టార్‌ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ తన పంచ్‌పవర్‌ చాటింది. మహిళల 50 కేజీల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన నిఖత్‌ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌ బౌట్‌లో నిఖత్‌ 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్‌ (జర్మనీ)పై విజయం సాధించింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ బౌట్‌ ఆరంభం నుంచే ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించగా... తన ఎత్తును సద్వినియోగ పర్చుకుంటూ జర్మనీ బాక్సర్‌ కూడా దీటైన పంచ్‌లు విసిరింది. 

అయితే రెండో రౌండ్‌లో తేరుకున్న నిఖత్‌.. కీలక సమయాల్లో హుక్స్, జాబ్స్‌తో పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచింది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఫ్లయ్‌ వెయిట్‌ ప్రపంచ చాంపియన్‌ వూ యూ (చైనా)తో నిఖత్‌ తలపడనుంది. మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ ప్రీతి పవార్‌ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో ప్రీతి 5–0తో వియత్నాం బాక్సర్‌ వో థీ కిమ్‌పై ఏకపక్ష విజయం సాధించింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)