Breaking News

నికోలస్‌ పూరన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్‌

Published on Sat, 08/24/2024 - 11:40

ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20ల‌ సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కరేబియన్లు ఊదిపడేశారు. 

17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విండీస్‌ ఛేదించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్‌ ఓపెనర్లు అలిక్‌ అథ్‌నాజ్‌(40), షాయ్‌ హోప్‌(51) పరుగులతో అద్బుత ఆరంభాన్ని అందిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 

కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో బార్టమన్‌ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.

రాణించిన స్టబ్స్‌..
అంతకముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌(76) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో పట్రిక్‌ కుర్గర్‌(44) పర్వాలేదన్పించాడు.

 విండీస్‌ బౌలర్లలో ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్‌ రెండు, అకిల్‌ హోస్సేన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 25న ట్రినిడాడ్‌ వేదికగానే జరగనుంది.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)