Breaking News

NZ vs BAN 3rd T20: బంగ్లాపై న్యూజిలాండ్‌ విజయం.. సిరీస్‌ సమం

Published on Sun, 12/31/2023 - 09:28

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో న్యూజిలాండ్‌ ముగించింది. మౌంట్‌ మంగ్‌నూయ్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో(డీఎల్‌ఎస్‌) కివీస్‌ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో న్యూజిలాండ్‌ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. కివీస్‌ బౌలర్ల దాటికి 110 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్‌ శాంట్నర్‌ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సౌథీ, మిల్నే, సీర్స్‌ చెరో రెం‍డు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్‌ ఇన్నింగ్స్‌ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు.

న్యూజిలాండ్‌ కూడా స్వల్ప లక్ష్య చేధనలో కాస్త తడబడింది. 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫిన్‌ అలెన్‌(38), నీషమ్‌(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్‌, షోర్‌ఫుల్‌ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్‌ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
చదవండి: #Saumy Pandey: ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)