Breaking News

టాలెంట్‌కు కొద‌వ లేదు.. పాక్‌ను నెం1 జ‌ట్టుగా నిలుపుతా: జాసన్ గిల్లెస్పీ

Published on Mon, 07/08/2024 - 09:54

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్టు జ‌ట్టు హెడ్‌కోచ్‌గా ఆదివారం బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.  ఈ క్ర‌మంలో ల‌హోర్‌లోని హైఫెర్మమెన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో స‌మ‌వేశంలో గిల్లెస్పీ పాల్గోనున్నాడు.

ఈ సంద‌ర్భంగా గిల్లెస్సీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను రెడ్‌బాల్ క్రికెట్‌లో నెం1 జ‌ట్టుగా తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తాని చెప్పుకొచ్చాడు. వ‌చ్చే నెల‌లో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌తోనే  పాక్ టెస్టు జ‌ట్టు హెడ్‌కోచ్‌గా గిల్లెస్పీ ప్ర‌యాణం మొదలు కానుంది. ఆ తర్వాత పాక్‌ స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

"పాకిస్తాన్ జ‌ట్టులో అద్బుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు. నిజంగా ఈ జ‌ట్టు చాలా టాలెంట‌డ్‌. కానీ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌లో నిల‌క‌డ‌లేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే మ‌రో మ్యాచ్‌లో డీలా ప‌డ‌డం ప‌రిపాటిగా మారింది. వారిని తిరిగి గాడిలో పెట్ట‌డ‌మే నా ప‌ని. 

అందుకు త‌గ్గ‌ట్టుగానే నేను ప‌నిచేస్తాను. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాకిస్థాన్ ఐద‌వ స్దానంలో ఉంది. రాబోయో సిరీస్‌ల‌లో విజ‌యం సాధించి మా ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకునేందుకు   ప్ర‌యత్నిస్తాము. 

మేము మా త‌దుప‌రి సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్నాం. ప్ర‌స్తుతం నా దృష్టి అంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఫ్యూచర్ కోసం ఇప్పటినుంచి నేను ఆలోచించను.  ముఖ్యంగా పాక్ జట్టులో కొన్ని విషయాలను గమనించాను. 

పాక్ తొలుత అద్భుతంగా రాణించి ఆఖరిలో బోల్తా పడటం  చాలా మ్యాచ్‌ల్లో చూశాను. బంగ్లాదేశ్‌ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌తో ఆడనున్నాం. కచ్చితంగా ఇంగ్లండ్‌ నుంచి మాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. నిజంగా మాకు అదొక ఛాలెంజ్‌. అందుకు తగ్గట్టు మేము కూడా సిద్దంగా ఉన్నాము. ఆఖరిగా పాక్‌ను నెం1 జట్టుగా నిలపడమే నా లక్ష్యమని" గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)