Breaking News

మాడ్రిడ్‌ వీధుల్లో కొత్త ఎఫ్‌1 సర్క్యూట్‌

Published on Wed, 06/11/2025 - 00:50

లండన్‌: స్పెయిన్‌లో కొత్త ఫార్ములావన్‌ ట్రాక్‌ సిద్ధమవుతోంది. మాడ్రిడ్‌ వీధుల గుండా పయనించే కొత్త సర్క్యూట్‌ వచ్చే ఏడాదే అందుబాటులోకి రానుంది. 2026 క్యాలెండర్‌లో జరిగే ఫార్ములావన్‌ రేసుల్లో సెప్టెంబర్‌ 13న కొత్త సర్క్యూట్‌పై స్పానిష్‌ గ్రాండ్‌ప్రి జరుగుతుందని ఎఫ్‌1 వర్గాలు తెలిపాయి. దీంతో వచ్చే ఏడాది స్పెయిన్‌లో రెండు ఫార్ములావన్‌ రేసులు నిర్వహిస్తారు. ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బార్సిలోనా గ్రాండ్‌ప్రి కూడా నిర్వహిస్తారని ఎఫ్‌1 ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2026 వరకు ఉండటం వల్ల బార్సిలోనా రేస్‌ యథాతథంగా జరుగనుంది. అయితే ఓవరాల్‌గా మాత్రం ఫార్ములావన్‌ సీజన్‌లో మొత్తం 24 రేసుల్లో ఏమాత్రం మార్పుండదు. స్పెయిన్‌ రెండు రేసుల కోసం ఇటలీ రేసును వచ్చే ఏడాది తప్పించనున్నారు. ఇమోలాలో ఎమిలియా–రొమాగ్నా గ్రాండ్‌ప్రి వచ్చే సీజన్‌లో కనిపించదు. దీని స్థానంలో మాడ్రిడ్‌ వీధుల్లో కొత్త సర్క్యూట్‌పై రేసును నిర్వహిస్తారు. జన సంచారం ఉండే వీధుల గుండా రయ్‌... రయ్‌...మనే ఫార్ములావన్‌ కార్ల రేసులు కొత్తేం కాదు. 

ఇదివరకే మొనాకో, సింగపూర్‌ దేశాల్లో వీధుల్లోనే ఎఫ్‌1 సర్క్యూట్‌ ఉంది. అయితే రేసు జరిగే సమయంలో మాత్రం సాధారణ జనసంచారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. వచ్చే మార్చి 8న ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రితో 2026 సీజన్‌ మొదలవుతుంది. పవిత్ర రంజాన్‌ నేపథ్యంలో బహ్రెయిన్, సౌదీ అరేబియాలలో జరిగే రేసులను ఏప్రిల్‌కు మార్చారు. డిసెంబర్‌లో జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రితో వచ్చే సీజన్‌ ముగుస్తుంది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)