Breaking News

ఇటువంటి పిచ్‌ను నా కెరీర్‌లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్‌

Published on Thu, 01/04/2024 - 12:28

కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రి​కా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్‌, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు.

ఇక కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్‌ రెండో టెస్టులో మాత్రం  4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎల్గర్‌ కేప్‌టౌన్‌ పిచ్‌ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్‌ కొనసాగుతన్నకొద్దీ వికెట్‌ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్‌ చెప్పుకొచ్చాడు.

"సాధారణంగా న్యూలాండ్స్‌ పిచ్‌ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్‌ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్‌లో సెషన్‌ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్‌ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను.

అయితే పిచ్‌ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు.  డొమాస్టిక్‌ క్రికెట్‌లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్‌ను ఇప్పటివరకు నా కెరీర్‌లో చూడలేదు" స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్‌ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)