మిచెల్‌ స్టార్క్‌ క్రీడా స్పూర్తి.. రనౌట్‌ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్‌

Published on Mon, 10/16/2023 - 17:33

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. బ్యాటర్‌ను మన్కడింగ్‌(రనౌట్‌) చేసే అవకాశం ఉన్నప్పటికీ స్టార్క్‌  కేవలం వార్నింగ్‌తో మాత్రమే సరిపెట్టాడు. 

ఏం జరిగిందంటే?
శ్రీలంక ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో నాలుగో బంతిని స్టార్క్‌ వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్టార్క్ బంతి డెలివరీ చేయకముందే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కుశాల్‌ పెరీరా క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్టార్క్‌ బంతిని విసరకుండా ఆగిపోయాడు.

అలా అని మన్కడింగ్‌(రనౌట్‌) కూడా చేయలేదు. వెంటనే పెరీరా వైపు చూసి మరోసారి అలా చేయవద్దు అంటూ హెచ్చరించాడు. అదే విధంగా ఫీల్డ్‌ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. కాగా క్రీడా స్పూర్తి ప్రదర్శించిన స్టార్క్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొత్త నిబంధనల ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగిణిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే: భారత మాజీ క్రికెటర్‌

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)