Breaking News

17 కోట్లు దండగా అన్నారు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు! నోళ్లు మూయించాడుగా

Published on Sun, 04/23/2023 - 08:36

ఐపీఎల్‌-2023లో శనివారం వాఖండే వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు యువ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన గ్రీన్‌.. అనంతరం బ్యాటింగ్‌లో (43 బంతుల్లో 67) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గ్రీన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 64 పరుగులు చేసిన ‍గ్రీన్‌.. బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

తొలుత విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు
ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన విషయం విధితమే. అయితే తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గ్రీన్‌ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగ అని, జట్టులోని తీసియండి అని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. ఇక గ్రీన్‌ తన అద్భుత ప్రదర్శనలతో విమర్శలకు చెక్‌ పెట్టాడు.

అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. గ్రీన్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ అని, అతడు తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేస్తున్నాడని ముంబై అభిమానులు సోషల్‌ మీడియాలో  పోస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌.. 166 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
                   #ArshdeepSingh: జాగ్రత్త..  అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్‌!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)