Breaking News

అంతర్జాతీయ క్రికెటర్‌పై నిషేధం

Published on Tue, 09/16/2025 - 20:29

నెదర్లాండ్స్‌ జాతీయ జట్టు ఆటగాడు వివియన్‌ కింగ్‌మా నిషేధానికి గురయ్యాడు. 30 ఏళ్ల ఈ పేసర్‌ ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. కింగ్‌మాకు ఈ ఏడాది మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 వన్డే మ్యాచ్‌ తర్వాత డోపింగ్‌ పరీక్ష నిర్వహించగా.. అందులో అతను బెంజోయెల్‌కోగ్నిన్ (కోకైన్ మెటబోలైట్) అనే రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ డ్రగ్‌ ఐసీసీ నిషేధిత జాబితాలో ఉంది.

కింగ్‌మా నిషేధ కాలం ఆగస్టు 15 నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, నిషేధకాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది.  

ఐసీసీ యాంటి-డోపింగ్‌ కోడ్‌ ప్రకారం.. మే 12 నుంచి (డోపీగా దొరికిన రోజు) కింగ్‌మా ఆడిన మ్యాచ్‌లన్నీ డిస్‌క్వాలిఫై అవుతాయి. అంటే ఆ మ్యాచ్‌ల్లో కింగ్‌మా తీసిన వికెట్లు, పరుగులు, క్యాచ్‌లు  పరిగణలోకి రావు. నాటి నుంచి కింగ్‌మా యూఏఈతో వన్డే, నేపాల్, స్కాట్లాండ్‌తో రెండు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో కింగ్‌మా గణాంకాలన్నీ రికార్డుల్లో నుంచి తొలగించబడతాయి. 

మరోవైపు కింగ్‌మా తాను చేసిన తప్పును అంగీకరించాడు. నిషేధిత డ్రగ్స్‌ను పోటీకి బయట ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. గత ఏడాది కాలంలో కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్) కూడా కింగ్‌మా లాగే రిక్రియేషనల్ డ్రగ్ వాడకానికి సంబంధించి నిషేధాలు ఎదుర్కొన్నారు. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన కింగ్‌మా నెదర్లాండ్స్‌ తరఫున 30 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో 40 వన్డే వికెట్లు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)