Breaking News

అజేయంగా ముగించాలని...

Published on Wed, 02/18/2026 - 04:27

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో ఈ రోజు మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌... యూఏఈతో దక్షిణాఫ్రికా... నమీబియాతో పాకిస్తాన్‌ తలపడనున్నాయి. టీమిండియా మ్యాచ్‌ సహా దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కూడా నామమాత్రమైందే! పాకిస్తాన్‌ మ్యాచ్‌ మాత్రమే కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికే ‘సూపర్‌–8’ బెర్తుల్లో ఏడు  (భారత్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌) ఖరారయ్యాయి. మిగిలింది ఒక్క బెర్త్‌ మాత్రమే. 

అది కూడా భారత జట్టున్న గ్రూప్‌ ‘ఎ’లోనే ఉండటంతో ఆఖరి బెర్త్‌ ఎవరిదో నేడే తేలుతుంది. దీంతో ఈ రాత్రికే ‘సూపర్‌–8’లో ఎవరెవరు ప్రత్యర్థులనేది కూడా తెలిసిపోతుంది.  ఇక మన మ్యాచ్‌ విషయానికొస్తే డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత్‌ ఆడిన మూడు గెలిచి దర్జాగా ‘సూపర్‌–8’కు చేరింది. నేడు జరిగే అనామక పోరులో భారత్‌... నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్‌ దశను అజేయంగా ముగించడమే పనిగా పెట్టుకుంది. 

టీమిండియాకు ఓడినా నష్టం లేదు. అలాగని నెదర్లాండ్స్‌ గెలిస్తే ఒరిగే ప్రయోజనం కూడా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇరుజట్లకు అక్కర్లేని మ్యాచ్‌. వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఉన్న మ్యాచ్‌... కాబట్టే ఆడాలి అంతే! ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్, ఆతిథ్య భారత్‌పై ఎవరికి ఏ బెంగా లేదు. సమష్టిగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో దూసుకెళుతోంది... కానీ ధనాధన్‌ హిట్టర్‌ అభిషేక్‌ శర్మ ఫామ్‌పైనే జట్టు మేనేజ్‌మెంట్‌ కన్నేసింది. 

రెండు ‘డకౌట్లు’ కాస్త ఇబ్బందికరం కావడంతో కీలకమైన ‘సూపర్‌–8’కు ముందే ఈ ఓపెనర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు ఎదురుండదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనే కాదు... వరల్డ్‌కప్‌లోనే భారత్‌కు పరుగుల పండగ ఖాయమవుతుంది.  

భారత్‌ జోరుకు ఎదురుందా... 
జట్టు జోరుపై, విజయాల తీరుపై ఎవరికీ ఎలాంటి సందేహాలే లేవు. ఇలాంటి జట్టుపై నెదర్లాండ్స్‌లాంటి కూన సంచలనానికి అవకాశమే లేదు. ఇషాన్‌ కిషన్‌ మెరుపులకు అభిషేక్‌ హిట్స్‌ తోడైతే జట్టుకు ఇది భలే బ్యాటింగ్‌ ప్రాక్టీసుగా పనికొస్తుంది. తిలక్‌ వర్మ,కెప్టెన్ సూర్య, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ప్రత్యర్థి శిబిరం నుంచి పెద్దగా సవాళ్లయితే ఉండవు. 

బౌలింగ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ బరిలోకి దిగుతాడు. మొత్తానికి పేస్, స్పిన్, బ్యాటింగ్‌ ఇలా అన్ని రంగాల్లో భారత జట్టు పటిష్టంగా ఉంది. మరోవైపు డచ్‌ టీమ్‌ మూడు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. టోర్నీ నుంచి ఈ ‘ఒకటే’ విజయంతో నిష్క్రమిస్తుంది తప్ప అసాధారణ, అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియానైతే ఢీకొట్టలేదు.  

పిచ్, వాతావరణం 
అహ్మదాబాద్‌ వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు చేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు. మంచు ప్రభావం ఉంటుంది. వర్షం ముప్పు లేదు.

టి20 ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా X  యూఏఈ
వేదిక: న్యూఢిల్లీ; ఉ.గం. 11 నుంచి
పాకిస్తాన్‌ X నమీబియా
వేదిక: కొలంబో; మ.గం. 3 నుంచి 
భారత్‌ X నెదర్లాండ్స్‌
వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)