Breaking News

క్రికెట్‌ చచ్చిపోతుంది.. ప్రపంచకప్‌ అంటే పేరుకు తగ్గట్టుగా ఉండాలి..!

Published on Mon, 07/03/2023 - 12:46

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో టూ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఘోర పరాజయాలు ఎదుర్కొని, తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రపంచకప్‌ అర్హతలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రపంచకప్‌ అంటే పేరుకు తగ్గట్టుగా కనీసం 16 దేశాలతో పోటీలు నిర్వహించాలని, అలా కాకుండా 4 ఏళ్లకు ఓ సారి జరిగే మెగా టోర్నీని 10 జట్లకే పరిమితం చేసి, విండీస్‌లా మేలైన జట్లకు అన్యాయం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ స్టీఫెన్‌ మైబుర్గ్‌ సైతం చెప్పుకొచ్చాడు. 

వాస్తవ విషయం ఏంటంటే.. పరిమిత జట్లతో ప్రపంచకప్‌ నిర్వహించడం వల్ల క్రికెట్‌ చచ్చిపోతుంది. ప్రపంచకప్‌ పేరుకు తగ్గట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి జట్లకు ప్రాతినిధ్యం లభించాలి. మెగా టోర్నీలో కనీసం 16 జట్లైనా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. అన్ని క్రీడల మెగా టోర్నీల్లో జట్ల సంఖ్య పెరుగుతుంటే క్రికెట్‌లో మాత్రం జట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. వెస్టిండీస్‌ లాంటి జట్టు వరల్డ్‌కప్‌ ఆడటం లేదన్న విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్టీఫెన్‌ మైబుర్గ్‌ అ​న్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

కాగా, ప్రస్తుతానికి (జులై 3) వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీల ద్వారా శ్రీలంక వన్డే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది. రెండో బెర్త్‌ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్‌ మధ్య పోటీ నెలకొని ఉంది. రేపు ఈ ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో రెండో బెర్త్‌పై కూడా దాదాపుగా క్లారిటీ రానుం​ది. సూపర్‌ సిక్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు క్వాలిఫయర్స్‌ ఫైనల్‌కు చేరడంతో పాటు ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ సహా 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇటీవలే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ కూడా విడుదలైంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)