Breaking News

నెదర్లాండ్స్‌ ఆశలు సజీవం

Published on Tue, 07/04/2023 - 05:35

హరారే: వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో నెదర్లాండ్స్‌ నిలిచింది. సోమవారం జరిగిన  ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్‌ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్‌ విక్రమ్‌జీత్‌ సింగ్‌ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు.  తర్వాత మళ్లీ వానతో ఒమన్‌ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్‌ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్‌ ఖాన్‌ (92 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు.  

నేడు జింబాబ్వే గెలిస్తే...  
ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారుకాగా... రెండో బెర్త్‌ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్‌తో తమ చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్‌ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్‌ ఫలితం తర్వాతే రెండో బెర్త్‌ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)