Breaking News

అత్యాచారం కేసు: నేపాల్‌ క్రికెటర్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష

Published on Wed, 01/10/2024 - 20:08

Sandeep Lamichhane sentenced: నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానే జైలు పాలయ్యాడు. అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఎనిమిదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదే విధంగా.. రూ. 3 లక్షల జరిమానా విధించడంతో పాటు.. బాధితురాలికి పరిహారం కింద రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

ఒకప్పటి కెప్టెన్‌
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సందీప్‌ లమిచానే కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు. పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌.. నేపాల్‌ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు
ఓవరాల్‌గా ఈ ఫార్మాట్లో 75 మ్యాచ్‌లలో కలిపి 158 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్‌. ఇందులో మూడు ఫైవ్‌ వికెట్స్‌ హాల్స్‌ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా ప్రసిద్ధి పొందిన సందీప్‌ లమిచానే.. 2018-20 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ 23 ఏళ్ల స్పిన్నర్‌ 13 వికెట్లు తీశాడు.

అప్పట్లోనే అరెస్ట్‌
ఆటగాడిగా కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయంలో అత్యాచార ఆరోపణలతో సెప్టెంబరు, 2022లో అరెస్టయ్యాడు. మూడు నెలల తర్వాత కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో తిరిగి క్రికెట్‌ మైదానంలో అడుగుపెట్టాడు.

శిక్షను తాజాగా ఖరారు చేసిన కోర్టు
అయితే, తాజాగా ఈ కేసు విచారణకు రాగా కాఠ్మండు జిల్లా కోర్టు సందీప్‌ లమిచానేకు ఎనిమిదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డిసెంబరు 29నాటి విచారణలో భాగంగా జస్టిస్‌ శిశిర్‌ రాజ్‌ ధాకల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అతడిని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌తో పాటు బీబీఎల్‌, పీఎస్‌ఎల్‌, బీపీఎల్‌, సీపీఎల్‌ వంటి టీ20 లీగ్‌లలో సందీప్‌ లమిచానే పాల్గొన్నాడు.

చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్‌! రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేది అతడే: ద్రవిడ్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)