Breaking News

తొలిసారి ఆసియాకప్‌కు.. నేపాల్‌ జట్టు ప్రకటన! కెప్టెన్‌ ఎవరంటే?

Published on Tue, 08/15/2023 - 08:32

చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు నేపాల్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఏసీసీ మెన్స్‌ ప్రీమియర్‌ కప్‌ 2023 ఫైనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టును ఓడించిన నేపాల్‌.. ఈ ఏడాది ఆసియాకప్‌కు క్వాలిఫై అయింది. భారత్‌, పాకిస్తాన్‌ ఉన్న గ్రూపు-ఏలో నేపాల్‌ చేరింది.

నేపాల్‌ జట్టు ప్రకటన..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ పాడెల్  సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో సందీప్ లామిచానే, కుశాల్‌ మల్లా వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నేపాల్‌ పెద్దగా రాణించలేకపోయింది. పాకిస్తాన్-ఏ, భారత్‌-ఏ వంటి జట్ల చేతిలో నేపాల్‌ ఓటమి పాలైంది.

కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై మాత్రం అద్భుత విజయం సాధించింది. ఇక ఆసియాకప్‌-2023లో నేపాల్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.

ఆసియా కప్ 2023కు నేపాల్ జట్టు - రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, డి.ఎస్. ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కె.సి., గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, కె. ప్రతీస్ జి.సి. మహతో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్
చదవండి
: ODI WC 2023: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సంచలన నిర్ణయం.. !

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)