Breaking News

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

Published on Sat, 06/13/2026 - 16:40

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సారథిగా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసిన ఘనత ఈ ‘మిస్టర్‌ కూల్‌’ సొంతం.

అయితే, ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. రికార్డుల కోసం మాత్రం ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా వంద టెస్టులకు చేరవవుతున్న వేళ అకస్మాత్తుగా ఈ దిగ్గజ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

అవకాశం ఉన్నా..
ఆస్ట్రేలియాతో 2014-15లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ జరుగుతున్న సమయంలో మూడో టెస్టు తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటికి మొత్తంగా కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన ధోని.. 4876 పరుగులు సాధించాడు. ఇంకొంత కాలం వేచి ఉంటే.. 100 టెస్టుల మైలురాయిని చేరడంతో పాటు.. ఐదు వేల పరుగుల మార్కు అందుకునే అవకాశం నాడు ధోనికి ఉంది.

కానీ అతడు జిడ్డులా పట్టుకుని వేలాడలేదు. తన రిటైర్మెంట్‌కు అదే సరైన సందర్భమని భావించి హుందాగా తప్పుకొన్నాడు. అయితే, కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉన్నా వదులుకునే వాళ్లు కొంతమందే ఉంటారని.. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ధోని నుంచి నేర్చుకోవాల్సిన జీవితం పాఠం
ఈ మేరకు.. ‘‘జీవితంలో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే, ధోని గురించి తెలుసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన విషయం అని నేను చెప్పగలను. మనకు ఏదైనా లభిస్తే.. దానిని పట్టుకుని ఉండటం సులువే.

ఒకవేళ మన వల్ల ఇక కుదరని తెలిసినా దానినే పట్టుకుని జిడ్డులా వేలాడుతూనే ఉన్నామనుకోండి.. అది జరగదని తెలిసినా వదిలివేయబుద్ధికాదు. కానీ కొంతమంది తమకు ఆ విషయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా సులువుగా దానిని వదులుకుంటారు.

సూపర్‌స్టార్‌ అయినా..
ముఖ్యంగా సూపర్‌స్టార్లుగా ఉన్న వ్యక్తులు అంత తేలికగా దేనినీ వదులుకోలేరు. కానీ ధోని అలా కాదు. అతడు దేనినైనా సులువుగా త్యజించగలడు. నాడు అతడు టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడిని ఎవరూ ఏమీ అనలేదు. అప్పుడతడు అంతటి పటిష్ట స్థితిలో ఉన్నాడు.

అయినా సరే సిరీస్‌ మధ్యలోనే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది వదిలేస్తున్నా’ అని ప్రకటించాడు. అతడు 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇంచుమించుగా ఐదు వేల టెస్టు పరుగులకు దగ్గరగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు మైలురాళ్ల గురించి ఆలోచించలేదు. 

తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రయోజనం లేదనుకుంటే ఏ విషయాన్నైనా పొడిగించడం సరికాదనే సందేశాన్ని ఇచ్చాడని తన ఫాలోవర్లతో పేర్కొన్నాడు.

దిగ్గజ సారథి
కాగా 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డేల్లో 10773, టెస్టుల్లో 4876, టీ20లలో 1617 పరుగులు సాధించాడు.

సారథిగా టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013 టైటిళ్లు గెలిచిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడి సూపర్‌ సెంచరీ!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)