Breaking News

మరో విజయంపై నీరజ్‌ దృష్టి

Published on Thu, 08/31/2023 - 02:49

జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌లో భాగంగా నేడు జ్యూరిక్‌లో జరిగే మీట్‌లో నీరజ్‌ పోటీపడనున్నాడు. ఈ సీజన్‌లో నీరజ్‌ రెండు డైమండ్‌ లీగ్‌ మీట్‌లలో (మే 5 దోహా; జూన్‌ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు.

అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌తోపాటు జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), ప్రపంచ మాజీ చాంపియన్‌ పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా), వెబెర్‌ (జర్మనీ) తదితర స్టార్స్‌ పోటీపడనున్నారు
.
ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం బిడ్‌..!
2027 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆతిథ్య హక్కుల కోసం భారత్‌ బిడ్‌ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహణ కోసం అక్టోబర్‌ 2లోపు బిడ్‌ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆతిథ్యం కోసం బీజింగ్‌ తమ బిడ్‌ దాఖలు చేసింది.  

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)