Breaking News

నీరజ్‌ చోప్రాకు స్వర్ణ పతకం

Published on Wed, 06/25/2025 - 03:51

ఒ్రస్టావా (చెక్‌ రిపబ్లిక్‌): భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... ఒ్రస్టావా గోల్డెన్‌ స్పైక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతవారం పారిస్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో ‘టాప్‌’లో నిలిచిన నీరజ్‌... మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్‌ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో నీరజ్‌కు ఇది రెండో టైటిల్‌ కావడం విశేషం. 

ఈ మీట్‌లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్‌ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్‌ (84.12 మీటర్లు; దక్షిణాఫ్రికా), అండర్సన్‌ పీటర్స్‌ (83.63 మీటర్లు; గ్రెనెడా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌... రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు.

మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్న భారత అథ్లెట్‌.. తర్వాతి ప్రయత్నాల్లో ఆకట్టుకోలేకపోయాడు. నీరజ్‌ కోచ్, చెక్‌ రిపబ్లిక్‌ గ్రేట్‌ అథ్లెట్‌ జాన్‌ జెలెజ్నీ గతంలో ఈ మీట్‌లో తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు.   

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)