స్వర్ణంతో శుభారంభం

Published on Fri, 04/18/2025 - 01:12

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 2025 సీజన్‌ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్‌్రస్టూమ్‌ ఇన్విటేషనల్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో 27 ఏళ్ల నీరజ్‌ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్‌ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్‌ రాబర్ట్‌సన్‌ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. 

నీరజ్‌ పాల్గొన్న ఈ మీట్‌కు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ చాలెంజర్‌ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్‌ జెలెజ్నిను కొత్త కోచ్‌గా నియమించుకున్నాక నీరజ్‌ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్‌ ర్యాంక్‌లో నిలువడం విశేషం. నీరజ్‌ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో, ఆ తర్వాత మే 24న పంచ్‌కులాలో జరిగే నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ త్రో టోర్నీలో పోటీపడతాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్‌... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సొంతం చేసుకున్న నీరజ్‌... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా అవతరించాడు.  

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)