Breaking News

ఒస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా

Published on Fri, 05/09/2025 - 00:57

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... వచ్చే నెలలో చెక్‌ రిపబ్లిక్‌లో జరగనున్న  ఒస్ట్రా​వా గోల్డెన్‌ స్పైక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొననున్నాడు. గత రెండు సార్లు గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్న నీరజ్‌ చోప్రా... జూన్‌ 24న జరిగే మీట్‌లో బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్‌ చోప్రా... ప్రస్తుతం కొత్త కోచ్‌ జాన్‌ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. 

‘ఒస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మీట్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నా. నా కోచ్‌ జెలెజ్నీ గతంలో ఈ టోర్నీలో చాలా సార్లు విజేతగా నిలవడంతో పాటు... ఈవెంట్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు’ అని నీరజ్‌ పేర్కొన్నాడు. 1961 నుంచి జరుగుతున్న ఈ మీట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య... గోల్డ్‌ లెవల్‌ మీట్‌ గుర్తింపునిచ్చింది. 

ఈ నెల 16న దోహా డైమండ్‌ లీగ్‌లో పాల్గొననున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌... ఈ నెల 24 భారత్‌లో తొలిసారి జరగనున్న ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నుంచి నీరజ్‌ తప్పుకున్నాడు. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)