Breaking News

‘లెఫ్టినెంట్‌ కల్నల్‌’ నీరజ్‌ చోప్రా

Published on Thu, 10/23/2025 - 05:36

సాక్షి, న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. టెరిటోరియల్‌ ఆర్మీలో అతనికి ‘లెఫ్టినెంట్‌ కల్నల్‌’ గౌరవ హోదాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో బుధవారం దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, టెరిటోరియల్‌ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్వయంగా నీరజ్‌ చోప్రా భుజాలపై లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా బ్యాడ్జ్‌లను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరజ్‌ పట్టుదల, దేశభక్తి, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. 

హరియాణాకు చెందిన నీరజ్‌  2016లో భారత సైన్యంలోని ‘ది రాజ్‌పుతానా రైఫిల్స్‌’లో సుబేదార్‌గా∙కెరీర్‌ను మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని ఘనతలకు గుర్తింపుగా 2021లో సుబేదార్‌ నుంచి మేజర్‌గా పదోన్నతి కలి్పంచారు. ఆ మరుసటి ఏడాది ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనికి టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ కమిషన్‌ను మంజూరు చేశారు. తాజాగా కల్నల్‌ గౌరవ హోదా కట్టబెట్టారు.  

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)