Breaking News

కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్‌ ఉల్‌ హక్‌.. గంభీర్‌ మద్దతు

Published on Sun, 05/07/2023 - 09:22

ఐపీఎల్‌ 2023లో భాగంగా మే 1న ఆర్సీబీ-లక్నో సూపర్‌ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి.. నవీన్‌ ఉల్‌ హక్‌, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య జరిగిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే నవీన్‌ ఉల్‌ హక్‌ మరోసారి కోహ్లిని రెచ్చగొట్టాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ తాజాగా తన జట్టు మెంటార్‌ గంభీర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ కోహ్లిని రెచ్చగొట్టే కామెంట్స్‌ చేశాడు.

మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో, మీరు కూడా వారితో అలాగే వ్యవహరించండి.. మీతో ఇతరులు ఎలా మట్లాడాలనుకుంటారో, మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి అంటూ నవీన్‌ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనిపై గంభీర్‌ స్పందిస్తూ.. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, ఎప్పుడూ మార్చుకోకు.. అంటూ నవీన్‌ కామెంట్స్‌కు మద్దతు పలుకుతూ కోహ్లికి పరోక్షంగా చురకలంటించాడు. మరి నవీన్‌-గంభీర్‌లు చేసిన ఈ వ్యాఖ్యలపై కోహ్లి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

మరోవైపు, గంభీర్‌ వ్యవహారం విషయమై కోహ్లి.. బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ లేఖలో కోహ్లి తన తప్పేమీ లేదని, తాను అమాయకుడినని, వారు రెచ్చగొడితేనే నేను స్పందించానని పేర్కొన్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే, కృనాల్‌ పాండ్యా (గాయంతో కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు) నేతృత్వంలో లక్నో టీమ్‌ ఇవాళ (మే 7) టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3: 30 గంటలకు ఈ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. ప్రస్తుతం లక్నో 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

చదవండి: గంభీర్‌, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)