Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం

Published on Wed, 09/27/2023 - 20:59

ఆఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్‌ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్‌లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్‌.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

నవీన్‌ తన వన్డే కెరీర్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్‌ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌ 2023లో కోహ్లితో గొడవతో నవీన్‌ ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు. 

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు తమ రెండో వరల్డ్‌కప్‌ ఆడేందుకు నిన్ననే భారత్‌కు వచ్చింది. వార్మప్‌ గేమ్‌ కోసం ఆఫ్ఘన్‌ క్రికెటర్లు  త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్‌ దాటలేని ఆఫ్ఘన్‌ టీమ్‌ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్‌ ఇచ్చి సంచలనాలు క్రియేట్‌ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్‌ జట్టులో నవీన్‌, రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో వారు బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్‌ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్‌ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)