Breaking News

హైదరాబాద్‌లో జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ పోటీలు 

Published on Thu, 06/29/2023 - 17:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 5 వరకు హైదరాబాద్‌ వేదికగా జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 500 మందికిపైగా స్విమ్మర్లు బరిలోకి దిగనున్నారు.

తెలంగాణ తరఫున 22 మంది స్విమ్మర్లు పోటీపడనుండగా... పురుషుల బృందానికి సూర్యాన్షు, మహిళల బృందానికి వ్రితి అగర్వాల్‌ నాయకత్వం వహిస్తారు. జాన్‌ సిద్దిఖి, ఆయూశ్‌ యాదవ్‌ కోచ్‌లుగా వ్యవహరిస్తారు. ఒలింపియన్‌ స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, సజన్‌ ప్రకాశ్, మానా పటేల్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.  

కేటీ లెడెకీ ఆరోసారి... 
అమెరికా మహిళా స్టార్‌ స్విమ్మర్‌ కేటీ లెడెకీ వరుసగా ఆరోసారి ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. గతంలో మైకేల్‌ ఫెల్ప్స్, రియాన్‌ లోచ్టె, నటాలీ కులిన్, ఎలిజబెత్‌ బీసెల్, నాథన్‌ అడ్రియన్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు. అమెరికా జాతీయ పోటీల్లో లెడెకీ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. లెడెకీ ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 స్వర్ణాలు గెలిచింది.   

అల్పైన్‌ వారియర్స్‌కు ఐదో విజయం 
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌జీ అలై్పన్‌ వారియర్స్‌ జట్టు ఐదో విజయం సాధించింది. భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ సభ్యుడిగా ఉన్న గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టుతో దుబాయ్‌లో బుధవారం జరిగిన ఏడో రౌండ్‌లో అలై్పన్‌ వారియర్స్‌ 10–8తో గెలిచింది. ఆనంద్‌తో జరిగిన గేమ్‌లో కార్ల్‌సన్‌ 72 ఎత్తుల్లో నెగ్గాడు. వారియర్స్‌కే చెందిన ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఇసిపెంకోను ఓడించగా... అర్జున్, ఎలిజబెత్‌ పాట్జ్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. గుకేశ్, ఇరీనా ఓడారు.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)