జాతీయ స్కూల్‌ చెస్‌ విజేత సంహిత

Published on Fri, 01/24/2025 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. కాకినాడలోని పెద్దాపురంలో జరిగిన ఈ టోర్నీలో సంహిత అండర్‌–11 బాలికల విభాగంలో చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. 

నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత సంహిత, రిషిత (ఆంధ్రప్రదేశ్‌) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా సంహితకు టైటిల్‌ దక్కగా... రిషిత రన్నరప్‌గా నిలిచింది. ఏడు గేముల్లో నెగ్గిన సంహిత... ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. 

అండర్‌–11 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన శ్యామల్‌ నిధిశ్‌ (7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అండర్‌–7 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన శ్రేయాంశ్‌ (7.5 పాయింట్లు) రజతం సాధించగా... ఓం ఈశ్‌ (7 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నాడు. అండర్‌–9 బాలికల విభాగంలో అరవ విశ్వాణి (ఆంధ్రప్రదేశ్‌; 7 పాయింట్లు) రజతం సాధించింది. 

అండర్‌–9 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన తిప్పర్తి శ్రేయాన్‌ (8.5 పాయింట్లు) చాంపియన్‌గా నిలువగా...తిమ్మరాజు వెంకట సాత్విక్‌ (7.5 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. అండర్‌–13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మోదిపల్లి దీక్షిత (8 పాయింట్లు) స్వర్ణ పతకం నెగ్గగా, వి.త్రిపురాంబిక (ఆంధ్రప్రదేశ్‌; 7.5 పాయింట్లు) రజతం సొంతం చేసుకుంది. అండర్‌–13 బాలుర విభాగంలో సామ్యూల్‌ స్టీఫెన్‌ నోబుల్‌ (ఆంధ్రప్రదేశ్‌; 8 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు. 

అండర్‌–15 బాలికల విభాగంలో గోర్లి నైనా (ఆంధ్రప్రదేశ్‌; 7 పాయింట్లు) రజతం... అండర్‌–17 బాలికల విభాగంలో చీదెళ్ల శర్వాణి (ఆంధ్రప్రదేశ్‌; 6.5 పాయింట్లు) రజతం... అండర్‌–17 బాలుర విభాగంలో జ్ఞాన సాయి సంతోష్‌ (ఆంధ్రప్రదేశ్‌; 7.5 పాయింట్లు) స్వర్ణం... మజ్జి రాంచరణ్‌ తేజ (ఆంధ్రప్రదేశ్‌; 6.5 పాయింట్లు) కాంస్యం గెలిచారు.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)