Breaking News

చరిత్ర సృష్టించిన నాట్ స్కివర్ బ్రంట్‌.. తొలి ప్లేయర్‌గా

Published on Tue, 01/27/2026 - 05:01

ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్‌, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా నాట్ స్కివర్ రికార్డులెక్కింది. డబ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్కివర్ ఈ అరుదైన ఫీట్ సాధించింది. 

నాట్ స్కివర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గతంలో సోఫీ డివైన్, జార్జియా వోల్ వంటి వారు 99 పరుగుల వద్ద ఆగిపోయినప్పటికి.. స్కివర్ మాత్రం సెంచరీ మార్క్‌ను అందుకుని తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

ముంబై ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 15 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపునుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నాట్ స్కివర్‌తో పాటు హేలీ మాథ్యూస్‌ (39 బంతుల్లో 56; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. 

తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్‌ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. 35/5 నుంచి ఆమె జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లినా ఆమె శ్రమ వృథా అయింది.  నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)