Breaking News

పాక్ బౌల‌ర్ సూప‌ర్ బాల్‌.. పాపం కేన్ మామ‌! ఐదేళ్ల త‌ర్వాత‌?

Published on Wed, 02/19/2025 - 16:50

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా క‌రాచీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న‌తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్( Kane Williamson) తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. పాక్ పేస‌ర్ నసీమ్ షా అద్బుత‌మైన బంతితో విలియ‌మ్స‌న్‌ను బోల్తా కొట్టించాడు. అత‌డి దెబ్బ‌కు కేన్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి పెవిలియన్‌కు చేరాడు. 

కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్ వేసిన న‌సీమ్ షా.. తొలి బంతిని కేన్ మామ‌కు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివ‌రీగా ఆఫ్‌సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియ‌మ్స‌న్ బ్యాక్‌ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంట‌నే అత‌డి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. 

దీంతో కేన్ మామ హెడ్‌ను షేక్ చేస్తూ నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు. ఇంద‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా విలియ‌మ్స‌న్ సింగిల్ డిజిట్ స్కోర్‌కు అవుట్ కావ‌డం 2019 త‌ర్వాత  ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

రవీంద్ర దూరం..
కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్‌ విల్‌ యంగ్‌(88 నాటౌట్‌) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.

29 ఓవర్లకు న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో గాయపడిన కివీస్‌ స్టార్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్‌ను వీడి బయటకు వెళ్లిపోయాడు.
తుదిజట్లు
పాకిస్తాన్‌
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)