Breaking News

వరల్డ్‌కప్‌నకు ముందు పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌! అతడు లేకుండానే..

Published on Fri, 09/15/2023 - 09:34

Asia Cup 2023- Pakistan vs Sri Lanka: వన్డే ప్రపంచకప్‌-2023కి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్‌ నసీం షా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా శ్రీలంకతో డూ ఆర్‌ డై మ్యాచ్‌ ఆడలేకపోయిన ఈ యువ ఫాస్ట్‌బౌలర్‌.. మెగా ఈవెంట్‌ నాటికి కూడా అందుబాటులోకి రావడం కష్టమేనని పాక్‌ సారథి బాబర్‌ ఆజం సంకేతాలు ఇచ్చాడు.

ఘనంగా ఆరంభించి.. కీలక సమయంలో చేతులెత్తేసిన పాక్‌
కాగా నేపాల్‌పై భారీ విజయంతో ఘనంగా ఆసియా కప్‌-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్‌.. సూపర్‌-4లో టీమిండియా చేతిలో అంతే చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. 

పేసర్లకు గాయాలు
కొలంబోలో లంకతో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్‌ పేస్‌ త్రయంలో ముఖ్యమైన ఇద్దరు బౌలర్లు హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్‌లో జమాన్‌ ఖాన్‌ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. మహ్మద్‌ వసీం జూనియర్‌ కూడా తుదిజట్టులో చోటు సంపాదించాడు.

అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకదే పైచేయి అయింది. రెండు వికెట్ల తేడాతో పాక్‌ మీద గెలిచి టీమిండియాతో తుదిపోరుకు లంక అర్హత సాధించింది. చెత్త బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కారణంగా బాబర్‌ ఆజం బృందం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.


నసీం షా

ఆసియా కప్‌ గోవిందా.. ఇక ప్రపంచకప్‌నకు ముందు మరో షాక్‌
ఈ నేపథ్యంలో హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా గాయాల గురించి బాబర్‌ ఆజం ఇచ్చిన అప్‌డేట్‌ పాక్‌ అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆసియా కప్‌ టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించిన మెన్‌ ఇన్‌ గ్రీన్‌.. వన్డే ప్రపంచకప్‌లో కూడా చేదు అనుభవం ఎదుర్కొంటుందా అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి. 

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘హ్యారిస్‌ రవూఫ్‌ పరిస్థితి బాగానే ఉంది. పక్కటెముకల నొప్పితో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, వరల్డ్‌కప్‌ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది.

నసీం షా కూడా అంతే. అయితే, అతడి రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను’’ అని బాబర్‌ ఆజం పేర్కొన్నాడు. అయితే.. ఐసీసీ ఈవెంట్‌కు నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నానంటూ మాట దాటవేశాడు.

గతంలో 14 నెలల పాటు ఆటకు దూరం
కాగా నసీం షా గాయం గురించి ఇంతవరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు. కుడి భుజం నొప్పితో విలవిల్లాడుతున్న అతడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక 20 ఏళ్ల నసీం షాకు గాయాల బెడద కొత్తే కాదు.

గతంలో వెన్నునొప్పి కారణంగా ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఏకంగా 14 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు వన్డేల్లో కీలక బౌలర్‌గా మారిన నసీం ఇప్పటి వరకు ఆ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో 14 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌-2023కి ముందు నసీం ఇలా గాయపడటం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్‌ ఆజం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)