Breaking News

'జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్‌'

Published on Sun, 10/20/2024 - 11:20

జస్ప్రీత్ బుమ్రా.. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఫాస్ట్ బౌల‌ర్ల‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు. మూడు ఫార్మాట్ల‌లో బుమ్రాను మించిన‌వారు లేర‌న‌డంలో అతిశయోక్తే లేదు. యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే సత్తా అతడిది. అటువంటి వరల్డ్‌క్లాస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్‌పై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా తన అక్కసును వెళ్లగక్కాడు.

జస్ప్రీత్ బుమ్రా కంటే పాక్ పేసర్ నసీమ్ షా  అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని ఇహ్సానుల్లా అభిప్రాయపడ్డాడు. కాగా నసీం షా మంచి ఫాస్ట్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఇప్పటికే తన పేస్, స్వింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ బుమ్రాతో పోల్చడమే అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

"బుమ్రా కంటే నసీం షా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌. బుమ్రా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇటువంటి ప్రదర్శనే నసీం 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో చేశాడు. ఒక్కో ఏడాది ఒకొక్కరు బాగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నసీం పెద్దగా తన మార్క్ చూపించలేకపోయాడు.

అయినప్పటకీ బుమ్రా కంటే నసీం ఎంతో బెటర్ అని" ఓ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. కాగా మూడు ఫార్మాట్ల‌లో బుమ్రా భార‌త్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 408 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రోవైపు న‌సీం షా 112 వికెట్లు సాధించాడు.
చదవండి: Ravindra Jadeja: భారత్‌ విజ‌యంపై ఆశ‌లు పెట్టుకోవ‌ద్దు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)