Breaking News

Ranji Trophy 2024: ఆంధ్ర జట్టు కొంపముం‍చిన ఒకే ఒక్క వికెట్‌..

Published on Tue, 10/22/2024 - 09:39

రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్‌ గుజరాత్‌ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఒక్క వికెట్‌ తేడాతో ఓటమి పాలైంది.

ఆంధ్ర నిర్దేశించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్‌ జట్టు 50.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 131 పరుగులవద్ద గుజరాత్‌ 9వ వికెట్‌ను చేజార్చుకోగా... అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా (16 నాటౌట్‌; 1 ఫోర్‌) గుజరాత్‌ జట్టును గట్టెక్కించాడు.

ఆంధ్ర జట్టు స్పిన్నర్‌ లలిత్‌ మోహన్‌ 76 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. శశికాంత్‌కు ఒక వికెట్‌ దక్కగా... మరో వికెట్‌ రనౌట్‌ రూపంలో వచి్చంది. అంతకుముందు ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 203/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు 90.5  ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. 

శ్రీకర్‌ భరత్‌ (47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34; 6 ఫోర్లు), త్రిపురాణ విజయ్‌ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా 4 వికెట్లు తీయగా... సిద్ధార్థ్‌ దేశాయ్, రవి బిష్ణోయ్‌ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.
చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)