Breaking News

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్‌​.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్‌

Published on Thu, 03/06/2025 - 08:22

బంగ్లాదేశ్ స్టార్‌​ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల రహీమ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టీ20లకు వీడ్కోలు పలికిన రహీమ్‌.. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముష్పికర్ వెల్లడించాడు.

అన్నివిధాలగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్‌​ తెలిపాడు. కాగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న  చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రహీమ్ దారుణం‍గా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రహీమ్ వన్డేలకు విడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్‌ అవుతున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన ప్రతీ విజయం వెనక ఆ దేవుడు ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో మేము సాధించిన  పరిమితం అయినప్పటికీ.. నేను మాత్రం నా దేశం కోసం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశాను. 

గత కొన్ని వారాలగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇక టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టిసారిస్తాను. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన బంగ్లా క్రికెట్‌కు, అభిమానుల‌కు, స‌హ‌చరుల‌కు ధ‌న్య‌వాదాలు తెల‌పాల‌నుకుంటున్నాను" అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు.

2006లో జింబాబ్వేతో జరిగిన వ‌న్డేతో ర‌హీమ్ బంగ్లాదేశ్ త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. త‌న కెరీర్‌లో బంగ్లా త‌ర‌పున 274 వ‌న్డేలు ఆడిన ముష్ఫికర్.. 36.42 స‌గ‌టుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు ర‌హీమ్‌ పేరిటే ఉంది. అదేవిధంగా వికెట్‌ కీపర్‌గా కూడా ముష్ఫికర్‌ 243 క్యాచ్‌లు అందుకున్నాడు.
చదవండి: స‌చిన్ హాఫ్ సెంచ‌రీ వృథా.. భారత్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)