Breaking News

MI Vs GT: ముంబై ముందుకు... గుజరాత్‌ ఇంటికి

Published on Sat, 05/31/2025 - 02:06

ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌... గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్‌–2కు చేరింది. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ దూకుడుకు... బెయిర్‌స్టో, సూర్యకుమార్‌ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్‌–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్‌... కీలక ఎలిమినేటర్‌ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్‌ నుంచి నిష్క్రమించింది.  

ముల్లాన్‌పూర్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపగా... జానీ బెయిర్‌స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. 

గుజరాత్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, సాయి కిషోర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... వాషింగ్టన్‌ సుందర్‌ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్‌–2లో పంజాబ్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. 

దంచుడే దంచుడు... 
టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్‌స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్‌ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన బెయిర్‌స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో ఫోర్‌తో దూకుడు పెంచిన బెయిర్‌స్టో... ప్రసిధ్‌ కృష్ణ వేసిన నాలుగో ఓవర్‌లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. 

సిరాజ్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన రోహిత్‌ సాయి కిషోర్‌ బౌలింగ్‌లో 6, 4, 4తో గేర్‌ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్‌ మరో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్‌స్టోను అవుట్‌ చేసి సాయి కిషోర్‌ గుజరాత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. 

రషీద్‌ ఓవర్‌లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్‌లు పూర్తి చేసుకున్న రోహిత్‌... 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్‌ను సాయి కిషోర్‌ పెవిలియన్‌ పంపగా... ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్‌ను ప్రసిధ్‌ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 సిక్స్‌లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. 

సుదర్శన్‌ పోరాడినా... 
భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్‌ (1) ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్‌ సుదర్శన్‌ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన కుశాల్‌ మెండిస్‌ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సహకరించగా... సుదర్శన్‌ క్లాస్‌ కవర్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. 

గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్‌ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్‌ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్‌ 148/2తో నిలిచింది. 

విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్‌తో సుందర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్‌ను గ్లీసన్‌ను అవుట్‌ చేయగా... రూథర్‌ఫోర్డ్‌ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్‌ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్‌), షారుక్‌ ఖాన్‌ (13; 1 సిక్స్‌) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి.  

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 81; బెయిర్‌స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్‌ 47; సూర్యకుమార్‌ (సి) సుందర్‌ (బి) సాయి కిషోర్‌ 33; తిలక్‌ (సి) మెండిస్‌ (బి) సిరాజ్‌ 25; హార్దిక్‌ (నాటౌట్‌) 22; నమన్‌ ధీర్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 9, సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–37–1; ప్రసిధ్‌ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్‌ 4–0–42–2; రషీద్‌ ఖాన్‌ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్‌ 1–0–7–0. 

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (బి) గ్లీసన్‌ 80; గిల్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 1; మెండిస్‌ (హిట్‌ వికెట్‌) (బి) సాంట్నర్‌ 20; సుందర్‌ (బి) బుమ్రా 48; రూథర్‌ఫోర్డ్‌ (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 24; తెవాటియా (నాటౌట్‌) 16; షారుక్‌ ఖాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్వని కుమార్‌ 13; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్‌ 3.3–0–39–1; హార్దిక్‌ పాండ్యా 3–0–37–0; సాంట్నర్‌ 1–0–10–1; నమన్‌ ధీర్‌ 1–0–9–0; అశ్వని కుమార్‌ 3.3–0–28–1.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)