Breaking News

ముంబైని ఓడించ‌డం అంత ఈజీ కాదు.. టాప్‌-2లో నిలుస్తుంది: హర్భజన్

Published on Fri, 05/02/2025 - 18:59

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌పై భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.  ఈ ఏడాది సీజ‌న్ గ్రూపు స్టేజి పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు.

"రాజ‌స్తాన్ రాయల్స్‌పై ముంబై ఇండియ‌న్స్ పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. ప్ర‌స్తుతం ముంబై ఛాంపియ‌న్ టీమ్‌లా ఆడుతోంది. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ప‌ది మంది ఆట‌గాళ్ల‌కు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే స‌త్తా ఉంది. 

ఏ జ‌ట్టుకైనా హార్దిక్ సేన‌ను ఓడించ‌డం అంత సులువు కాదు. క‌చ్చితంగా గ్రూపు స్టేజిలో ముంబై టాప్‌-2లో నిలుస్తుంద‌ని నేను భావిస్తున్నాను. ముంబై గ్రూపు స్టేజిని 18 లేదా 20 పాయింట్ల‌తో ముగుస్తుంద‌ని" హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)