Breaking News

MI Vs PBKS: ముంబై X పంజాబ్‌

Published on Mon, 05/26/2025 - 01:27

జైపూర్‌: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా... సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ పోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశలో 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై 8 విజయాలు, 5 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో రెండో ‘ప్లేస్‌’లో కొనసాగుతోంది. టాప్‌–2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరేందుకు మరో అదనపు అవకాశం ఉండటంతో... ఇరు జట్లు దానిపైనే దృష్టి సారించాయి. 

సీజన్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై జట్టు... ఆ తర్వాత వరుస విజయాలతో విజృంభిస్తుంటే... పంజాబ్‌ కింగ్స్‌ 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత సాధించింది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు స్టార్‌ ఆటగాళ్లతో నిండి ఉంటే... శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చిన్న బౌండరీల మైదానంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయం కాగా... ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న బుమ్రా ఫామ్‌లో ఉండటంతో ముంబైకి కాస్త మొగ్గు ఉంది. 

సూర్యకుమార్‌ యాదవ్‌ 583 పరుగులతో ఫుల్‌ ఫామ్‌లో ఉండగా... రోహిత్‌ శర్మ, రికెల్టన్, విల్‌ జాక్స్‌ మంచి టచ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ... ధాటిగా ఆడలేక ఇబ్బంది పడుతుండగా... హార్దిక్‌ పాండ్యా, నమన్‌ ధీర్‌ భారీ షాట్లతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు అందిస్తున్నారు. 

బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్, దీపక్‌ చాహర్, సాంట్నర్‌ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సీజన్‌లో 488 పరుగులు చేయగా... ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (486), ప్రియాన్‌‡్ష ఆర్య (362) దూకుడు మీదున్నారు. ఈ జంట మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతోనే ఆ జట్టు నిలకడ కొనసాగించగలుగుతోంది. జోష్‌ ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్, స్టొయినిస్‌తో పంజాబ్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. 

గత మ్యాచ్‌లో టాపార్డర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... చివర్లో స్టొయినిస్‌ మెరుపులు మెరిపించడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయగలిగింది. ఇలాగే ప్రతి మ్యాచ్‌లో ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుంటుండటం పంజాబ్‌ కింగ్స్‌కు కలిసి వస్తోంది. బ్యాటింగ్‌లో ముంబైకి దీటుగా ఉన్న పంజాబ్‌... బౌలింగ్‌లో మాత్రం కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. అర్‌‡్షదీప్‌ సింగ్, మార్కో యాన్సెన్‌పై అధిక భారం పడుతోంది. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా... లేక పంజాబ్‌ ప్రతాపం కనబరుస్తుందా చూడాలి!  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)