Breaking News

ప్రతీకార పోరు

Published on Sun, 04/27/2025 - 04:55

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్‌’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా మంచి టచ్‌లో ఉంది. 

అయితే ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్‌గా రెండు జట్లు 9 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. 

ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్‌ శర్మ, విల్‌ జాక్స్, రోహిత్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున శార్దుల్‌ ఠాకూర్, దిగ్వేశ్‌ రాఠీ, నికోలస్‌ పూరన్, ఎయిడెన్‌ మార్క్‌రమ్, అవేశ్‌ ఖాన్‌ గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్‌ వర్మ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.  

జోరు సాగిస్తేనే... 
హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్‌ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్‌ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ తన విలువ చాటుకుంటున్నాడు. 

రికెల్టన్, విల్‌ జాక్స్‌ కూడా మంచి టచ్‌లో ఉండగా... తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, నమన్‌ ధీర్‌ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్‌ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, దీపక్‌ చహర్‌ పేస్‌ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.  

టాపార్డర్‌పైనే భారం...   
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్‌–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్‌ మార్ష్, మార్క్‌రమ్, పూరన్‌ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్‌ ఈ సీజన్‌లో 200 పైగా స్ట్రయిక్‌రేట్‌తో 377 పరుగులు చేశాడు. మార్క్‌రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. 

కెప్టెన్ రిషబ్‌ పంత్‌ ఫామ్‌ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్‌లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్‌ 9 మ్యాచ్‌ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. ఆయుశ్‌ బదోనీ, అబ్దుల్‌ సమద్‌ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్‌ మిల్లర్‌ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్‌ రాఠీ కీలకం కానున్నారు.

తుది జట్లు (అంచనా) 
ముంబై ఇండియన్స్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రికెల్టన్, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్, సాంట్నర్, దీపక్‌ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్‌. 
లక్నో సూపర్‌ జెయింట్స్‌: పంత్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్‌ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్‌ రాఠీ, అవేశ్‌ ఖాన్, ప్రిన్స్‌ యాదవ్‌.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)