IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌లోకి శ్రీలంక కెప్టెన్‌..!

Published on Thu, 05/15/2025 - 19:02

ఐపీఎల్‌-2025 రీ షెడ్యూల్ కార‌ణంగా దారుణంగా నష్ట‌పోతున్న ఫ్రాంచైజీలలో ముంబై ఇండియ‌న్స్ ఒక‌టి. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా ఆర్ధ‌రంత‌రంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే చాలా మంది విదేశీ ఆట‌గాళ్లు జాతీయ విధుల కార‌ణంగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కానున్నారు.

ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు  ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ సేవ‌ల‌ను కోల్పోయే అవ‌కాశ‌ముంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసిన‌ దక్షిణాఫ్రికా జట్టులో బాష్, రికెల్ట‌న్ భాగంగా ఉన్నారు. బాష్‌, రికెల్ట‌న్‌ ఒక‌వేళ ఐపీఎల్‌లో పాల్గోనేందుకు తిరిగి భార‌త్‌కు వ‌చ్చినా, ప్లే ఆఫ్స్‌కు మాత్రం క‌చ్చితంగా దూరంగా ఉండ‌నున్నారు.

ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌తో బీసీసీఐ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ప్ప‌టికి.. స‌ద‌రు క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్లు లీగ్ పూర్తి అయ్యేంత‌వ‌ర‌కు ఉండేందుకు అనుమతి ఇవ్వ‌లేదు. మ‌రోవైపు వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో జాక్స్ సభ్యునిగా ఉన్నాడు. అత‌డు కూడా భార‌త్‌కు తిరిగి వ‌చ్చినా ప్లే ఆఫ్స్‌కు మాత్రం దూరంగా ఉండ‌నున్నాడు.

ముంబై జట్టులోకి శ్రీలంక కెప్టెన్‌..?
ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం శ్రీలంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక‌పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు చరిత్ అసలంకాతో ముంబై చర్చలు జ‌రుపుతున్న‌ట్లు శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. అసలంక‌కు టీ20ల్లో అద్బుత‌మైన రికార్డు ఉంది. అత‌డికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే స‌త్తా ఉంది. 

అంత‌ర్జాతీయ టీ20ల్లో చరిత్‌కు 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత‌డితో ఒప్పందం కుద‌ర్చుకునేందుకు ముంబై ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా ఐపీఎల్ రీ షెడ్యూల్ కార‌ణంగా ఈ సీజ‌న్‌లో ఆట‌గాళ్ల‌ తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ముంబై ఇండియ‌న్స్‌కు ఈ ఏడాది సీజ‌న్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ సేన‌ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది.
చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బ‌ట్ల‌ర్‌.. గుజ‌రాత్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)