Breaking News

ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన

Published on Fri, 11/29/2024 - 09:31

ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్‌, టిమ్‌ డేవిడ్‌, నువాన్‌ తుషార 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 

2024 సీజన్‌లో ఆర్సీబీ​​కి ఆడిన విల్‌ జాక్స్‌, రీస్‌ టాప్లే, కర్ణ్‌ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.

కాగా, ఐపీఎల్‌ 2025 మెగా వేలం నవంబర్‌ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.

వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్‌ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. 

ఐపీఎల్‌ 2025 వేలంలో సెకెండ్‌ హైయ్యెస్ట్‌ పేమెంట్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్‌ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్‌ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)