Breaking News

రంజీ బాట పట్టిన టీమిండియా విధ్వంసకర వీరులు

Published on Mon, 02/03/2025 - 20:17

హర్యానాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (​ఫిబ్రవరి 8-12)  కోసం 18 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించారు. వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం ముంబై సెలెక్టర్లు భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ శివమ్‌ దూబేను ఎంపిక చేశారు. 

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌, రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ పేర్లను ముంబై సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు భారత వన్డే జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబై జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్‌ మాత్రే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, సిద్దేశ్‌ లాడ్‌ చోటు దక్కించుకున్నారు. ముంబై బౌలింగ్‌ అటాక్‌ను శార్దూల్‌ ఠాకూర్‌ లీడ్‌ చేస్తాడు. బౌలింగ్‌ విభాగంలో మోహిత్‌ అవస్తి, శివమ్‌ దూబే, తనుశ్‌ కోటియన్‌, షమ్స్‌ ములానీ సభ్యులుగా ఉన్నారు. ఆకాశ్‌ ఆనంద్‌, హార్దిక్‌ తామోర్‌ వికెట్‌ కీపర్లుగా ఎంపికయ్యారు.

కాగా, ముంబై జట్టు గ్రూప్‌ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేఘాలయాపై ఘన విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలుపొందడంతో బోనస్‌ పాయింట్‌ కూడా సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ 456 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మేఘాలయా 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్‌ ఠాకూర్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లయ్యారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 671 పరుగులు చేసింది. సిద్దేశ్‌ లాడ్‌ (145), ఆకాశ్‌ ఆనంద్‌ (103), షమ్స్‌ ములానీ (100 నాటౌట్‌) సెంచరీలు చేశారు. ఆజింక్య రహానే (96), శార్దూల్‌ ఠాకూర్‌ (84) సెంచరీలు మిస్‌ చేసుకున్నారు. అనంతరం మేఘాలయా రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ముంబై జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్‌కీపర్‌), హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్‌), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్‌ కోటియన్‌, మోహిత్‌ అవస్తి, సిల్వెస్టర్‌ డిసౌజా, రాయ్‌స్టన్‌ డయాస్, అథర్వ అంకోలేకర్‌, హర్ష్ తన్నా
 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)