Breaking News

టీమిండియా బౌలర్‌ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా

Published on Fri, 08/04/2023 - 09:51

టీమిండియా పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20కు తుది జట్టులో చోటు దక్కించుకున్న ముఖేష్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు.

అంతకుముందు ముఖేష్‌ ఇదే పర్యటనలో విండీస్‌పై టెస్టు, వన్డే డెబ్యూ చేశాడు. కాగా ఈ ఘనత సాధించిన జాబితాలో ముఖేష్‌ కంటే ముందు టీమిండియా పేసర్‌ నట్‌రాజన్‌ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో ముఖేష్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ముఖేష్‌ ​కుమార్‌ 24 పరుగులిచ్చి వికెట్లు ఏమీ పడగొట్టలేదు. అంతకుముందు  విండీస్‌తో సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డేలో మాత్రం ముఖేష్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. విండీస్‌ చేతిలో 4 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో హార్దిక్‌సేన చతికిలపడింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది.

భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్‌ బౌలరల్లో మెకాయ్‌, హోల్డర్‌, షెపర్డ్‌ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు .అంతకముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. కెప్టెన్‌ పావెల్‌(48), పూరన్‌(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. కొన్ని తప్పులు చేశాం! అతడొక సంచలనం: హార్దిక్‌ పాండ్యా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)