Breaking News

చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Published on Sat, 03/29/2025 - 16:58

పాకిస్తాన్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ ఘ‌నంగా ఆరంభించింది. నేపియ‌ర్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో పాక్‌పై 73 ప‌రుగుల తేడాతో కివీస్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ అబ్బాస్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అబ్బాస్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు.

తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన‌ అబ్బాస్‌.. అనంతరం బౌలింగ్‌లో ఓ కీల‌క వికెట్ కూడా ప‌డ‌గొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అబ్బాస్‌.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుపడ్డాడు. కేవ‌లం 24 బంతుల్లోనే త‌న తొలి అంత‌ర్జాతీయ హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 52 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అబ్బాస్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

వ‌న్డే అరంగేట్రంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా అబ్బాస్ రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా అల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. కృనాల్ పాండ్యా 2021లో ఇంగ్లండ్‌పై త‌న వ‌న్డే అరంగేట్రంలో 26 బంతుల్లో ఆర్ధ‌శ‌త‌కం సాధించాడు. తాజా మ్యాచ్‌లో 24 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన అబ్బాస్‌.. పాండ్యా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా కివీస్ త‌రుపన డెబ్యూచేసిన అబ్బాస్‌.. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆట‌గాడు కావ‌డం గ‌మ‌నార్హం.

చాప్‌మ‌న్ సూప‌ర్ సెంచ‌రీ..
ఇక ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో మార్క్‌ చాప్‌మన్‌ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచ‌రీతో చెల‌రేగాడు. అత‌డితో న‌పా డారిల్‌ మిచెల్‌ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.

పాక్ బౌల‌ర్ల‌లో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు ప‌డగొట్ట‌గా.. రౌఫ్, జావిద్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 44.1 ఓవ‌ర్ల‌లో 271 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాక్ బ్యాట‌ర్ల‌లో బాబ‌ర్ ఆజం(76) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..  మొహమ్మద్‌ రిజ్వాన్‌ (30), సల్మాన్‌ అఘా (58) ప‌ర్వాలేద‌న్పించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో నాథ‌న్ స్మిత్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. డ‌ఫీ రెండు, బ్రెస్‌వెల్ త‌లా వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)