Breaking News

అక్కడ ఉన్నది ధోని.. కొంచెం చూసి వెళ్లాలి కదా డీకే! వీడియో వైర‌ల్‌

Published on Sat, 03/23/2024 - 07:00

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే స్టార్ ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం​ రానప్పటికీ.. వికెట్ కీపింగ్‌లో మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.

మిస్టర్ కూల్ రెండు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్‌లో భాగమయ్యాడు. ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు. మ్యాచ్‌లో చాలా వరకు ఎక్స్‌ట్రాస్ వెళ్లకుండా తన గ్లౌవ్ వర్క్‌తో అడ్డుకున్న ఎంఎస్‌.. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అద్భుతమైన రనౌట్ చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఆఖరిబంతికి దినేష్ కార్తీక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కార్తీక్ బై రన్ కోసం పరిగెత్తమని నాన్ స్ట్రైక్‌లో ఉన్న అనుజ్ రావత్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అనుజ్ రావత్ స్ట్రైకర్ ఎండ్‌వైపు వచ్చేలోపే ధోని స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో రావత్ రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ​మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది ధోని.. కొంచెం చూసి వెళ్లాలిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి