Breaking News

యువ బౌలర్‌కు క్లాస్‌ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్‌

Published on Tue, 04/04/2023 - 12:48

చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లో మొయిన్‌ అలీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దేశ్‌పాండే రెండు వికెట్లు, శాంట్నర్‌ ఒక వికెట్‌ సాధించారు.

దేశ్‌పాండేకు క్లాస్‌ పీకిన ధోని..
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన తుషార్‌ దేశ్‌ పాండే అంతగా అకట్టుకోలేకపోయాడు. రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 45 పరుగులిచ్చాడు. ముఖ్యంగా దేశ్‌పాండే ఎక్స్‌ట్రాస్‌ రూపంలో 7 పరుగులిచ్చాడు. అందులో ఏకంగా 3నోబాల్స్‌ ఉండడం గమనార్హం.

దేశ్‌పాండే తన వేసిన తొలి ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఈ ఓవర్‌లో రెండు నోబాల్స్‌, మూడు వైడ్‌లు వేశాడు. ఓవరాల్‌గా ఆ ఓవర్‌లో 18 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం దేశ్‌ పాండేకు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని క్లాస్‌ పీకాడు. నో బాల్స్‌ ఎక్కువగా వేయడంపై ఎంఎస్‌ కాస్త సీరియస్‌ అయ్యాడు. దేశ్‌పాండే తన నో బాల్స్‌ సమస్యను అధిగమించేందుకు మిస్టర్‌ కూల్‌ కొన్ని చిట్కాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)