Breaking News

తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’ పురస్కారం 

Published on Mon, 10/09/2023 - 03:45

ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998  బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక  చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’ అవార్డు దక్కడం విశేషం.

ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు  సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్‌ యుఫె, కిన్‌ హైయాంగ్‌లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్‌ జాంగ్‌ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్‌ హైయాంగ్‌ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్‌  దిగ్గజం లిన్‌ డాన్‌ (2010 గ్వాంగ్‌జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్‌ యుఫె, కిన్‌ హైయాంగ్‌ గుర్తింపు పొందారు.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)