Breaking News

గేల్‌ను అధిగమించిన బట్లర్‌

Published on Sat, 08/01/2026 - 15:57

ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. ది హండ్రెడ్‌ 2026లో భాగంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్.. ఆల్‌టైమ్ టీ20 పరుగుల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు.

ట్రెంట్ రాకెట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 37 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో అతడి టీ20 కెరీర్ పరుగుల సంఖ్య 14,780కి చేరింది. గేల్ 14,562 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 746 మ్యాచ్‌ల్లో 14,803 పరుగులు ఉన్నాయి. బట్లర్ మరో 24 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించి, పోలార్డ్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు
1. కీరన్ పొలార్డ్ – 14,803
2. జోస్ బట్లర్ – 14,780
3. క్రిస్ గేల్ – 14,562
4. అలెక్స్ హేల్స్ – 14,449
5. డేవిడ్ వార్నర్ – 14,284
6. విరాట్ కోహ్లీ – 14,218
7. జేమ్స్ విన్స్ – 13,748
8. షోయబ్ మాలిక్ – 13,571
9. క్వింటన్ డి కాక్ – 12,654
10. రోహిత్ శర్మ – 12,531

బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన బట్లర్
బట్లర్‌కు ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు కూడా దక్కింది. టీ20ల్లో అతడి 50+ స్కోర్ల సంఖ్య 114కి చేరింది. దీంతో అతడు పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజమ్ రికార్డును సమం చేశాడు.

ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 128 హాఫ్ సెంచరీ+ స్కోర్లతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 120తో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్, బాబర్ ఆజమ్ 114 స్కోర్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

ఇదిలా ఉంటే, ట్రెంట్ రాకెట్స్‌తో మ్యాచ్‌లో బట్లర్ 55 పరుగులు చేసినప్పటికీ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 137/3కే పరిమితమైంది. అనంతరం ఫిన్ అలెన్ 35 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో ట్రెంట్ రాకెట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)